మా ఇంటి ముందు ఆంధ్ర నుండి వచ్చిన సెటిల్ అయిన పాల వ్యాపారి 2014 వరకు డీజిల్ జనరేటర్ పెట్టుకొని కరెంటు పోయినపుడల్లా వేలకు వేలు డీజిల్కి ఖర్చుపెట్టేటోడు , ఇప్పుడు డీజిల్ పైసల్ మిగుల్తున్నాయి ఎప్పుడు అంటే అప్పుడు పన్నీర్ కోవా చేస్తున్నాడు , (1/17)
వ్యాపారం వృద్ధి చెంది మా ఇంటి ముందే రెండు అంతస్థుల బిల్డింగ్ కట్టాడు . ఒక పాక నుండి బిల్డింగ్ ఎలా అంకుల్ అని అడిగితే డీజిల్ ఖర్చులు మిగుల్తున్నాయి ఇంకా కెసిఆర్ వచ్చినాక పల్లెటూర్లో పాలు బాగా దొరుకుతున్నాయి సప్లై పెరిగింది మాకు కూడా సప్లైకు తగ్గ డిమాండ్ పెరిగింది . (2/17)
తెలంగాణ అంతటా 2015 వరకు ఇంచుమించు ఎకరం భూమి మూడు నుండి పది లక్షలు ఉండేది ఎటు చుసిన బీడు భూములు రాళ్ళూ రప్పలు పంటలు పండేవి చాల తక్కువ నీళ్లు బోర్లు యాడ ఉంటె ఆడనే నీళ్ల లభ్యత ప్రకారం మక్కా వారి పత్తి ఇంకా ఆర్మూర్ దిక్కు పసుపు మిగితా జిల్లాలు నల్లగొండ పాలమూరు కృష్ణ నది (3/17)
పారుతున్న పొలాలు మాత్రం చానా తక్కువ ఇటు కరీంనగర్ వరంగల్ దిక్కు తుమ్మచెట్లు తప్ప ఎం ఉండకపోతుండే , కాళేశ్వరం పుణ్యమా అని ఇప్పుడు ఒక గుంట భూమి తక్కువలు తక్కువ 2 లక్షల రూపాయలు అయ్యింది ఎటు ఎంత లోపలికి పోయిన ఎకరం 25 లక్షలకు తక్కువ దొర్కుడు చాల అంటే చాల అరుదు . (4/17)
నోట్ల రద్దు వాళ్ళ దేశం కుదేలు మంటే తెలంగాణాల మాత్రం డబ్బు అంత భూముల రూపంలోకి మారింది రైతులు రాజులూ అయ్యారు ప్రతి పల్లెటూర్లో ఇప్పుడు 20 కార్లకు తక్కువ లేవు సగం భూమి అమ్మితే సాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించింది దానికి కన్నా ఎన్నో రేట్ల పైసలు వస్తున్నాయి మిగితా భూమికి రైతే (5/17)
బంధు వస్తుంది ఇంకో పక్కన నీళ్లు వస్తున్నాయి పల్లెలు వలసల నుండి ఘర్ వాపసీ అంటూ దుబాయ్ బొంబాయి నుండి మల్ల తిరిగివస్తున్నారు . (6/17)
మా పొలం కౌలుకు చేసే అతనికి ఒక టీవీఎస్ ఒక ట్రాక్టర్ సబ్సిడీ కింద కాళ్ళనికి పైసలు వాళ్ళ నాయనకు అవ్వకు పెన్షన్ భార్యకి బీడీ పెన్షన్ ఇంకా పైసలు జమ చేసి మా పొలం పక్కనే ఇంకో ఇంత జమ చేసి కొన్నాడు రెండు కలిపి పంట పండిస్తుండు అటు చెపేలు పట్టి ఊర్ల అమ్ముకుంటుండు . (7/17)
ఇదంతా బంగారు తెలంగాణ కాదా ? ఒక్క హైదరాబాద్ కాదు మిగితా జిల్లాలు లెవా తెలంగాణాల అవి ఎలా ఉన్నాయో సినిమాల్లో చూసారా ఎప్పుడైనా , (8/17)
గోదారి ఆంధ్రాలో కన్నా తెలంగాణాలో ఎక్కువ పారుతుంది కానీ వాడుకోలేని స్థితి నుండి ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకం కింద ఎన్నో రెసోర్వాయర్లు తెలంగాణ అంతటా కెనాల్లు కనపడ్తున్నాయా ? వీకెండ్ వస్తే కొండపోచమ్మ సాగర్ పోతలేరా జనాలు . (9/17)
౩౩ జిల్లాలు చేస్తే ఊర్లన్నీ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు లాగా దేవోలోప్ అయినాయి అదే ఆంధ్రాలో మాత్రం ఎన్నో ఊర్ల పేర్లు వింటుండే ఇప్పటికి అసలు జనాలకు వరంగల్ హైదరాబాద్ తప్ప తెల్వకపోతుండే కానీ ఇప్పుడు స్వాభిమానంతో మాది మెదక్ నిర్మల్ జగిత్యాల అని చెప్పుకుంటునారు . (10/17)
అన్ని జిల్లాలో ఇప్పుడు కలెక్టరేట్లు sp ఆఫీసులు మిగితా డిపార్ట్మెంట్ ఆఫీసులు వచ్చాయి జిల్లాకు నిధులు ఎక్కువ వస్తున్నాయి దశ మారుతుంది . ఒకప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లు తప్ప వేరే తాన లేకుండా ఇప్పుడు అన్ని జిల్లాలో వంద పడకల ఆసుపత్రులు . (11/17)
ఇన్నెండ్లు పాలించిన నల్లగొండ గొప్ప కాంగ్రెస్ నేతలు ఏమి చేసారు flouride రాకాసిని ఒక్క మిషన్ భగీరథతో లక్షల మందిని రాన్నున్న తారలను కాపాడాడు . చెప్పనికి రాయానికి నా చేతులు నోర్లు అరిగిపోతాయి మస్తు మాట్లాడతారు ఎం చేసిండు ఎం చేసిండు అని compare చేయద్దు కానీ పోలవరం ఏమాయె ? (12/17)
ఎన్ని ఏండ్ల సంధి నడుస్తుంది కథ ? అసుంటివి బొచ్చెడు కట్టిండు మూడు ఏండ్లలలో .ఒక్కటా రెండా పథకాలు మస్తు ఉన్నాయ్ చెప్పనికి చేసినై మస్తు ఉన్నాయ్ అడుగు అడుగున చూపించవచ్చు ఎం జరిగిందో . (13/17)
ఇదంతా మసి బిసి చెప్పే మోడీ కథ కాదు గ్రాఫిక్స్ చంద్రబాబు కథ కాదు నమ్మకానికి నిజాయితీకి కమిట్మెంట్కు రాజకీయ చాణక్యతకు ఉద్యమ రథసారథి తెలంగాణ సాధకుడు చేసిన చేస్తున్న పనులు . (14/17)
ప్రతి సారి తక్కువ అంచనా వేస్తారు దాన్ని తిప్పి కొట్టి చీల్చి చెండాడుతాడు అది ఏదైనా సరే అటు పాలసీలు కానీ పాలనా కానీ రాజకీయం కానీ .
తెలంగాణ తెచ్చింది కెసిఆర్ , తెలంగాణ దశ మార్చింది కెసిఆర్ , తెలంగాణను బ్రతికిస్తుంది కెసిఆర్ , (15/17)
తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం కెసిఆర్ అందరి గుండెల్లో ఉంటాడు .
చరిత్రలో ఇన్ని పథకాలు ఏనాడూ చూడలేదు ఏనాడూ పొందలేదు అంత తానై అందరి పెద్ద దిక్కుగా మారి అన్ని వర్గాల మన్ననలు పొందుతూ దేశంలో తెలంగాణను ఎన్నో రంగాల్లో అతి తక్కువ కాలంలో నెంబర్ 1 గా నిలుపుతూ కరప్షన్ తగ్గించి ప్రజలకు (16/17)
అనువుగా పాలనా చేస్తూ రాష్టాన్ని ఒక దిక్కున కాషాయ గుజరాతి గుళములనుండి కాంగ్రెస్ కబ్జాదారులు నుండి ఆంధ్ర పెత్తందార్లనుండి కాపాడుతూ ముందుకు వెళ్తున్న తెలంగాణ బాపుకు జన్మదిన శుభాకాంక్షలు .
#HAPPYBIRTHDAYKCR(17/17)
You can follow @manobhavaalu.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.