అది పార్టీ కాదు...రాజ‌కీయ చొర‌బాటు
షర్మిల తెలంగాణ‌లో పెట్టి ఏం సాధించ‌బోతోంది?ఆంధ్ర పాల‌కుల‌కు వ్య‌తిరేకంగానే క‌దా తెలంగాణ ఉద్య‌మం జ‌రిగింది.అలాంటప్పుడు ష‌ర్మిల త‌న పార్టీకి తెలంగాణ ప్ర‌జ‌ల ఆమోదం ఎలా ఉంటుంద‌ని ఆశిస్తోంది?ఇలాంటి ప్ర‌శ్న‌లు తెలంగాణలోని ప్ర‌తి సామాన్యుడుకి వ‌స్తాయి
ఈ విష‌యంలో జ‌గ‌న్‌, షర్మిల ప‌రివారం కూడా క్లారిటీతోనే ఉండి ఉంటారు. ప్ర‌తి పార్టీకి అధికార‌మే ప‌ర‌మావ‌ధి కాన‌క్క‌ర్లేదు. ష‌ర్మిల కూడా తెలంగాణ‌లో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుందామ‌న్న పెద్ద ఆశ‌ల‌తో పార్టీని పెట్ట‌డం లేదు. దాని వెన‌క క‌నిపంచ‌ని ప్ర‌యోజ‌నాలు, ఆధిప‌త్య‌లు
ఎత్తుగ‌డ‌లున్నాయి

ష‌ర్మిల పార్టీ వెనన హైద‌రాబాద్‌తో ముడిప‌డి ఉన్న ఆర్థిక ప్ర‌యోజ‌నాలు దాగివున్నాయ‌న్న‌ది వాస్త‌వం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని స్థాప‌న ఇంకా ఏటు తేల‌కుండా ఉంది. అమరావ‌తి కానీ విశాఖ‌ప‌ట్నం కానీ హైద‌రాబాద్ స్థాయి ఆర్థిక‌ప‌ర‌మైన హంగుల‌తో ఎద‌గాలంటే ఇంకో ఇర‌వైఏళ్ల‌యిన
ప‌డుతుంది. భ‌విష్య‌త్తులో కూడా హైద‌రాబాద్ వారి వ్యాపార కార్య‌క‌లాపాల‌కు కీల‌క కేంద్రం. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఏస్టేట్‌, ప‌రిశ్ర‌మ‌లు వారి ప్రాంతానికి, సామాజిక వ‌ర్గానికి చెందిన వారి చేతిలోనే ఉన్నాయి. భ‌విష్య‌త్తులో ఇక్క‌డ వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ య‌థేశ్చ‌గా, రాజ‌కీయంగా
ఎలాంటి అడ్డులేకుండా జ‌ర‌గాలంటే కేసీఆర్‌నో, మ‌రో ఇత‌ర తెలంగాణ నాయ‌కుల‌నో దేబిరించాల్సిన ప‌రిస్థితి రావొద్దు.(మ‌హానేత పాల‌న‌లో ఆయ‌న ప్రాంతానికి చెందిన ఫ్యాక్ష‌న్ నేత‌లు హైద‌రాబాద్ భూముల‌ను చెర‌ప‌ట్టార‌న్న‌ది అంద‌రికి తెలిసిన విష‌యం.ఇప్పుడు తెలంగాణ‌లో అలాంటి కబ్జా ఆట‌లు సాగ‌డం లేదు)
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయ‌ప‌ర‌మైన ట‌ర్‌బ్యూలెన్స్ ఉంది. ఇన్ని సంవ‌త్స‌రాలు ఏ స్వాభిమాన పాల‌న కోసం పోరాటం చేశామ‌న్న విష‌యాన్ని చాలా మంది మ‌ర్చిపోతున్నారు. వెస్టెడ్ ఇంట్రెస్ట్‌తో కేసీఆర్ మీద వ్య‌తిరేక‌త పెంచుకుంటున్నారు. తెలంగాణ సాధ‌కుడైన ఆయ‌న్నే ఇష్టారీతిన తూల‌నాడ‌టం
ఏ ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌నో అర్థం కానీ ప‌రిస్థితులున్నాయి.తెలంగాణ‌లో అంత‌కుముందెన్న‌డూ లేని మ‌త‌, కుల ప‌ర‌మైన విభ‌జ‌న తీసుకొచ్చే ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన కుట్ర జ‌రుగుతోంది.
వీట‌న్నింటికి అలుసుగా తీసుకొని తెలంగాణ వేదిక మీద ఓ ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతోంది ష‌ర్మిల‌.అనుకోవ‌చ్చు.తెలంగాణ‌లో
అంధ‌భ‌క్తుల మాదిరిగానే..నీళ్ల‌ దొంగ మ‌హామేత‌కు అభిమానులున్నారు. రేప్పొద్దున ఆర్థిక లేక మ‌రో ప్ర‌యోజ‌నం కోస‌మే జెండాలు మోయ‌డానికి సిద్ధంగా ఉంటారు. అదే స‌మ‌యంలో ఏంతో కొంద‌మంది సామాజిక వ‌ర్గ అండ ఉంటుంది. హైద‌రాబాద్‌లో ఆ ప్రాంతానికి చెందిన సెటిల‌ర్లు గ‌ణ‌నీయంగా ఉన్నారు.
ఈ స‌మీక‌ర‌ణాన్ని బేరీజు వేసుకుంటే తెలంగాణ‌లో ఓ నాలుగైదు స్దానాల్ని పొంద‌గ‌లిగిన అది విజ‌య‌మే అవుతుంది. రాజ‌కీయాల్ని ఎవ‌రూ ఊహించ‌లేరు కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో హంగ్‌లాంటి ప‌రిస్థితులు వ‌స్తే..ఉన్న కొద్ది మందితో పాటు ఆర్థిక‌బ‌లంతో ఇంకొంద‌రిని త‌మ ప‌క్షం చేర్చుకొని
ఇక్క‌డ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పొచ్చు. దాంతో హైద‌రాబాద్‌తో ముడిప‌డి ఉన్న త‌మ ప్ర‌యోజ‌నాలు సాఫీగా జ‌రిగే వీలుంటుంది. ఇలాంటి ఆకాంక్ష‌ల‌తోనే కొత్త పార్టీకి రంగం సిద్ధం చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం... అనేక పోరాటాలు, త్యాగాల‌తో సాధించుకున్న తెలంగాణ‌లో రాజ‌కీయ అనిశ్చితి ఎప్పుడూ
శ్రేయ‌స్క‌రం కాదు. ఇవ‌న్నీ ప‌చ్చ‌టి తెలంగాణ‌లో నిప్పులు రాజేసే కుట్ర‌లే...శ‌త్రు సంహారం జ‌రిగింద‌ని ఏమ‌రుపాటుగా ఉంటే మ‌న‌లోని అనైక్య‌తే పెట్టుబ‌డిగా శ‌త్రుశేషాలు చొర‌బాటుకు ప్ర‌య‌త్నిస్తాయి. ష‌ర్మిల పార్టీని తెలంగాణ‌లో జ‌రిగే రాజ‌కీయ చొర‌బాటు చ‌ర్యే అనుకోవాలి.
You can follow @NaveenKotriki.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.