గత టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రిగా నారా లోకేష్ @naralokesh గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి ఏడాదిలోనే శాఖల పరంగా తీసుకొచ్చిన   #సంస్కరణలు,చేపట్టిన   #ముఖ్యమైన_కార్యక్రమాలు#విజయాలు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ..
#HBDLokeshAnna
లోకేష్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎన్‌టిఆర్‌ జలసిరి, వాటర్‌షెడ్‌ పథకాలను అమలు చేస్తూ 23 ప్రభుత్వ శాఖల అనుసంధానంతో సహజవనరుల పరిరక్షణ, గ్రామీణ కుటుంబాల అభివృద్ధి, సంస్థాగత అభివృద్ధి, మౌలిక సదుపాయల 
కల్పనకు గణనీయమైన కృషి చేసింది.
పథకం అమలులో పారదర్శకత,జవాబుదారీతనం కోసం ఎక్కడా లేని విధంగా సామాజిక తనిఖీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
చట్టంలో చెప్పిన విధంగా వేతనాలు, మెటీరియల్‌ నిష్పత్తి 60:40ను సమర్ధవంతంగా వాడుకుంటూ అటు కూలీల వేతన చెల్లింపులు ఇటు సుస్థిర ఆస్తుల ఏర్పాటులో దేశానికి మార్గదర్శకంగా నిల్చింది.
నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, 
పచ్చదనం పెంపు, వ్యక్తిగత ఆస్తుల ఏర్పాటు థ్యేయంగా ఆనాటి టీడీపీ ప్రభుత్వం ముందుకు అడుగులు వేసింది.
ఇతర రాష్ట్రాలకు భిన్నంగా 23 ప్రభుత్వ శాఖలతో అనుసంధాన ప్రక్రియ విధానాన్ని తీసుకు వచ్చి, గ్రామీణ మౌలిక 
సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసింది.
2017-18 ఆర్ధిక సంవత్సరంలో గతం కంటే భిన్నంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని రూపొందించి, 23 శాఖలతో 
అనుసంధాన ప్రక్రియను బలోపేతం చేసింది. రాష్ట్ర ఉపాధి హామీ మండలిని ఏర్పాటు చేసి కార్యక్రమ అమలులో కూడా పంచాయితీ రాజ్‌ 
సంస్థల ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర స్ధాయిలో భాగస్వామ్యం కల్పించారు.
మిషన్‌ అంత్యోదయ, మిషన్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ విధానాలతో 
గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించటానికి, సహజవనరుల యాజమాన్యాన్ని సుస్థిర ప్రాతిపదికన చేపట్టడానికి ఉపాధి హామీ పథకాన్ని ఒక 
వజ్రాయుధంగా తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వానికి, లోకేష్ గారికి దక్కుతుంది.
అన్ని స్థాయిల్లో పథకాన్ని సమర్ధవంతంగా పర్యవేక్షించటానికి పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి #లోకేష్ గారు 
ప్రత్యేక చొరవతో కోర్‌ డాష్‌ బొర్డును 2017-18 లో రూపొందించారు. ఈ డాష్‌ బొర్డుకు స్కోచ్‌ అవార్డు రావటం ఒక #కలికితురాయిగా 
పేర్కొనవచ్చు.
2017-18 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్రం ఫారం పాండ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, 
అంగన్‌వాడీ కేంద్రాలు, రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకం పనుల్లో వివిధ శాఖల అనుసంధానం, మెటీరియల్‌ వాటా వినియోగంలో 
దేశంలోనే ప్రధమ స్థానంలో నిల్చింది.
#లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం అమల్లో, సాధించిన ప్రగతిలో మన రాష్ట్రం తనదైన ముద్ర వేసుకుని, దేశంలోనే విభిన్నంగా అనేక అవార్డులు సాధించింది.
#సాధించిన_ప్రగతి : 2017-18

బడ్జెట్‌ :
నిర్దేశించుకున్న లక్ష్యం 20 కోట్ల పనిదినాలు కాగా 101.45 శాతంతో 20.29 కోట్ల పనిదినాలు పూర్తి

మూడు సంవత్సరాల్లోనే అత్యధికంగా ఆ ఏడాది రూ.2,932.72 వేతనాలకు 
ఖర్చు

మెటీరియల్‌ ఖర్చు రూ. 2,407.44 కోట్లు

పథకం మొత్తం ఖర్చు రూ. 5,644.16 కోట్లు
చేపట్టినపనులు:

రూ. 561.49 కోట్లతో 2,72,129 ఫారం పాండ్లు తవ్వాలనేది లక్ష్యం

1,53,096 ఫారం పాండ్ల పనులు పూర్తికాగా 1,19,033 నిర్మాణ దశలో ఉన్నాయి.

అంచనా వ్యయం రూ. 161.72 కోట్లతో 2,23,295 వ్యక్తిగత మరుగుదొడ్లు లక్ష్యం

1,59,014 మరుగుదొడ్లు పూర్తి.
64,281 నిర్మాణంలో ఉన్నాయి.
1,02,739 వర్మి/నాడెప్‌ కంపోస్ట్‌ గుంతలు రూ. 68.54 కోట్ల లక్ష్యం.
57,259 పూర్తి చేయగా
45,480 గుంతల పనులు జరుగుతున్నాయ్

రూ. 52.90 కోట్లతో 10,244 కి.మీ. పొడవున రోడ్డుకిరువైపుల మొక్కలు నాటే పనులు 
చేపట్టారు.

84,271 ఎకరాల్లో రూ. 140.55 కోట్లతో పండ్ల తోటలు అభివృద్ధిపరుస్తున్నారు.
రూ. 5.98 కోట్లతో 5,52,155 ఇంకుడు గుంతలు లక్ష్యం
1,79,653 పూర్తయ్యాయి
3,72,502 పనులు ప్రగతిలో ఉన్నాయి.
పెరటి తోట పనుల్లో భాగంగా 2,78,661మొక్కలను రూ.1.78 
కోట్ల వ్యయంతో నాటారు.

2017-18 ఏడాదిలో వాటర్‌ షెడ్‌ పనులు చేపట్టని గ్రామాల్లో గ్రీనింగ్‌ ఆఫ్‌ హిల్లాక్స్‌ పనులను చేపట్టారు.
#పశుసంవర్ధక_శాఖ:

రూ. 2.55 కోట్లతో 1,421 పశువుల నీటి తోట్టెలను నిర్మించాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు 601 
కాగా ఇంకా 820 పనులు జరుగుతున్నాయి.

రూ. 15.88 కోట్ల ఖర్చుతో 16,892 ఎకరాల్లో ఊరూరా పశు గ్రాస క్షేత్రాలు పేరిట గడ్డి పెంపకం 
చేట్టారు.
#గృహ_నిర్మాణ శాఖ

1,33,826 ఇటుక తయారీ యూనిట్లకి 317.87 కోట్లు కేటాయించగా 71,437 యూ. పూర్తి కాగా 62,389 కావాల్పి వుంది.1,43,171 మంది లబ్ది పొందారు.
ఇంటికి 90 పని దినాలు చొప్పున 1,09,928 ఇళ్లకి రూ.110.79 కోట్లు
కేటాయించాగా ఇందులో 14,993 పనిదినాలు పూర్తి కాగా 94,935 కావాల్సివుంది.
#పట్టు_పరిశ్రమ_శాఖ

3,343 మల్బరీ తోటల పనులను రూ. 6.18 కోట్ల అంచనాతో ప్రారంభించగా అప్పటికే 102 
పనులు పూర్తికాగా 3,241 పనులు జరుగుతున్నాయి

పట్టుదారం తీసే 742 యూనిట్ల షెడ్లను రూ. 5.81 కోట్ల ఖర్చుతో నిర్మించాలని భావించగా
50 షెడ్లు పూర్తయ్యాయి.
692 షెడ్లు నిర్మాణంలో వున్నాయి.
#పంచాయతీరాజ్‌_శాఖ

రూ. 1358.97 కోట్లతో 5,744 కి.మీ. పొడవైన సిమెంట్‌ రోడ్లను నిర్మించారు.

1,379 గ్రామ పంచాయతీ కార్యాలయాలను రూ.62.53 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రణాళికలు 
సిద్ధం చేశారు. అప్పటి వరకు 449 పూర్తిచేయగా 930 పనులు ప్రగతిలో ఉన్నాయి.
రూ.2.79 కోట్ల వ్యయంతో 72 మండల స్త్రీశక్తి భవనాలను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 
43 పూర్తి కాగా ఇంకా 29 ప్రగతిలో ఉన్నాయి
రూ.101.90 కోట్ల ఖర్చుతో
6,060 అంగన్‌ వాడీ కేంద్రాలను నిర్మించాలని లక్ష్యం
2,991 కేంద్రాలు పూర్తి చేశారు 3,069 నిర్మాణంలో ఉన్నాయి.
విద్యా సంస్థల్లో 2030 ఆట స్థలాలను రూ.12.39 కోట్లతో అభివృద్ధి చేయటానికి పనులు చేపట్టి 
నేటికి 169 పనులు పూర్తి చేయగా 1861 పనులు కొనసాగుతున్నాయి

5568 స్మశానాలను రూ.71.14 కోట్ల వ్యయంతో స్వర్గపురులుగా మార్చాలనేది లక్ష్యం 
4,900 పూర్తి చేయగా
668 అవుతూ వున్నాయ్.
#మత్స్యశాఖ

459 పనులను రూ.7.96 కోట్లతో మంజూరు చేసి, నేటి వరకు 66 పనులు పూర్తి చేశారు. ఇంకా 
393 పనులు పూర్తికావాల్సివుంది.

211 చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫారంలను నిర్మించడానికి రూ.2.23 కోట్లను కేటాయించి,
80 పనులను పూర్తి చేశారు.
131 పనులు అవుతూ వున్నాయ్
#శాప్‌(ఎస్‌.ఎ.ఎ.పి)

2057 ఆట స్థలాలను రూ.12.69 కోట్లతో అభివృద్ధి చేయటానికి ప్రణాళికలు రూపొందించి 170 పనులు చేయగా
1887 పనులు కొనసాగుతున్నాయి
#ప్రధాన_కార్యక్రమాలు

1) గ్రామాల్లోని ఎస్‌.సి./ఎస్‌.టి. కాలనీలకు అంతర్గత రోడ్లు :

గ్రామ మౌలిక సదుపాలయాలను మెరుగు పర్చడంలో భాగంగా ప్రత్యేకించి ఎస్‌.సి. / ఎస్‌.టి. ఆవాసాలకు సిమెంటు రోడ్లను ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌. కింద సాంకేతిక నైపుణ్యం గల పి.ఆర్‌. శాఖ ద్వారా 
నిర్మించారు.
3) గ్రీనింగ్‌ ఆఫ్‌ హిల్లాక్స్‌ :
2029 నాటికి రాష్ట్రాన్ని 50శాతం మేరకు పచ్చదనంతో కళకళలాడేటట్టు చేయాలని ఆనాటి రాష్ట్ర గౌరవ 
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్వప్నం.

ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర భూసార పరిక్షణ,మొక్కలు నాటడం వంటి విధానాల ద్వారా కొండలను చెట్లతో /పచ్చదనంతో పునరుద్ధరించారు.
#స్మశానాలు :

గ్రామీణ మౌలిక సదుపాయాలు, మంచి వాతావరణం ఏర్పాటుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య 
జీవితాలను ఇచ్చేందుకు 30% ఎన్‌ఆర్‌ఐ/ఇతర నిధులను కలుపుకొని రూ. 10 లక్షల అంచనాతో ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌. పనుల్లో 
భాగంగా స్మశానాల అభివృద్ధి పనులు చేపట్టారు.
#ఎన్‌టిఆర్‌_జలసిరి
ఎక్కడైతే అదనపు భూగర్భ జలాలు పునరుద్ధరణయ్యాయో ఆ ప్రాంత సన్నకారు రైతులకు 2017-18 సం.లో ఎన్‌టిఆర్‌ జలసిరి ఫేజ్‌ 2 కార్యక్రమాన్ని అమలు చేశారు.
డ్రిప్‌/స్ప్రింక్లర్లు వాడుతూ పేద రైతుల జీవనోపాధులను మెరుగుపర్చి ఆదాయాలను 
పెంచడంపై ఎన్‌టిఆర్‌ జలసిరి దృష్టి పెట్టింది.
2017-18 లో #సాధించిన_ప్రగతి :

35వేల బోరుబావులను తవ్వి,వాటికి సోలార్‌ పంపు సెట్లను బిగించాలనేది లక్ష్యం
19,343 బోరుబావులు తవ్వారు.

13,849 సోలార్‌ కనెక్షన్లుకు గానూ ఎపి ట్రాన్స్‌కోకు చెల్లింపులు కూడా చేశారు.

ఇప్పటి వరకు 9,093 బోరుబావులకు సోలార్‌ సౌకర్యం కల్పించారు.
#ఆస్తుల ఏర్పాటు

చెక్‌ డ్యాంలు/చెక్‌ వాల్స్‌ ~ 3,666

ఫారం/డగవుట్‌ పాండ్లు ~ 41,404

సిడిలు/పిటిల మెరుగుదల పనులు ~ 1,792

ఊటకుంటలు/చిన్న ఊటకుంటలు ~ 1,338

సమతల/నిరవధిక కందకాలు ~ 761

గల్లీ కంట్రోల్‌ పనులు ~ 3,780

పశువుల నీటి తోట్టెలు ~ 487

పంట కల్లాలు ~ 502

ఇతరాలు ~ 1,160
ఉత్పాదక విధానాల అభివృద్ధి(పిఎస్‌ఐ)

ఆయిల్‌ ఇంజిన్లు ~ 256

స్ప్రేయర్లు ~ 956

టార్పాలిన్లు ~ 2,960

వాటర్‌ కారియింగ్‌ పైపులు ~ 1,208

బ్రీడింగ్‌రామ్స్‌,పశువుల ఆరోగ్యశిబిరాలు ~ 5,792

ఆస్తులు లేని పేదలకు జీవనోపాధులకు 28.16 కోట్లు పాడి కేంద్రాలు-డైరీలు, 
వ్యవసాయంకి వెచ్చించారు.
రూ. 15.53 కోట్లతో చేపట్టిన ఉత్పాదక విధానాల అభివృద్ధి(పిఎస్‌ఐ) పనుల ద్వారా11,763 మంది లబ్ది పొందారు.

రూ. 3.16కోట్లతో చేపట్టిన 647 సంస్థాగత సామర్ధ్యాల నిర్మాణ శిక్షణా కార్యక్రమాలద్వారా 26,531 మంది భాగస్వాములు శిక్షణ పొందారు.
పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన "తొలి ఏడాదిలోనే" మా #లోకేష్ గారు సాధించిన విజయాలు.. అభివృద్ది పనులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా గుర్తు చేశా. చెప్తే ఇంకా సేనా వున్నాయ్.మరి తొలి ఏడాదిలో నువ్వేం చేసావో చెప్పగలవా జగన్ రెడ్డి @ysjagan .. పప్పు బెల్లాలు తప్ప..
#HBDLokeshAnna
You can follow @kiranbs45.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.