నాకు తెలిసిన రిటైర్డ్ గ్రూప్-2 అధికారి ఒకరితో కొంచెం సేపు సరదాగా మాట్లాడాను (థ్రెడ్)

గతంలో చంద్రబాబు పర్యటనకి వస్తే జిల్లా కలెక్టర్ మొదలు VRO వరకు అందరూ వారం ముందు నుంచే అన్ని సమాచారాలను సిద్ధం చేసుకుని కంఠతా పట్టి దగ్గర పెట్టుకునే వారట ఆయన ప్రతి పర్యటనలో కనీసం ఒక అధికారి (1/n)
సస్పెండ్ అవ్వటం ఖాయం అనుకునేవారట ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినా లేదా తప్పుడు సమాధానం ఇస్తున్నామని ఆయనకు అనిపించిన నిమిషం గ్యాప్ లేకుండా విచారణకు ఆదేశించేవారట అది కలెక్టర్ అయినా సరే అంతే ఆయన అంత ఖచ్చితంగా వ్యవహరించడానికి కూడా ఒక కారణం ఉంది (2/n)
ఆయన వెళ్లే పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను ముందే సేకరించు కుంటారట అప్పటి వరకు అక్కడ ఉన్న సమస్యల గురించి అంతకు ముందు అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు గురించి ఒకసారి మొత్తం చూసుకున్న తరువాత ఆ పర్యటనకు బయలు దేరుతారు ప్రతి పర్యటనలోనూ అక్కడ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు (3/n)
అదిగో సరిగ్గా అక్కడే అధికారులు దొరికిపోతారు చంద్రబాబు ముందు ఎంత నటించిన ప్రజలు ఉన్న వాస్తవాలను కుండ బద్దలు కొట్టడంతో అక్కడి అధికారులకు కష్టకాలం మొదలవుతుంది

చంద్రబాబు గారు ఎంత నిక్కచ్చిగా వ్యవహరించ బట్టే తరువాత కాలంలో ఉద్యోగులకూ ఆయన భారంగా అనిపించారు (4/n)
అందుకే తరువాతి కాలంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా వారికి ఓటు వేయటం మొదలు పెట్టారు ఈ విషయం అనేక సార్లు చంద్రబాబు గారు బహిరంగంగానే చెప్పారు తరువాత కాలంలో చంద్రబాబు గారు ఉద్యోగుల పట్ల కొంచెం మెతక వైఖరి ప్రదర్శించడం ప్రారంభించారు ప్రజలలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి (5/n)
చంద్రబాబు గారు మారిపోయారు అని అయినా ఉద్యోగుల పట్ల గతంతో పోలిస్తే కఠిన వైఖరి తగ్గింది అని చెప్పవచ్చు

అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించక పోయినా జగన్ రెడ్డికి ఓటు వేశారు ఈసారి ఓటు వేయడం కాదు దాదాపు మూడొంతుల ఉద్యోగులు (6/n)
తమ ఖాళీ బ్యాలెట్ పేపర్లపై సంతకాలు పెట్టి అధికార పార్టీకి అమ్ముకున్నారు అయితే ఓటు వేసిన ఉద్యోగులకు ఇప్పుడు నొప్పి కలుగుతుంది ముఖ్యంగా ఉపాధ్యాయులకు చంద్రబాబు గారు ఉద్యోగులతో పని చేయించినా వారిని ఎప్పుడూ చులకన చేయలేదు వారికి తగిన గౌరవం ఇచ్చేవారు (7/n)
దానికి ఉదాహరణ హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతి రావటానికి అనేకసార్లు వారితో సంప్రదింపులు జరిపి వారు పెట్టిన అన్ని షరతులకు అంగీకారం తెలిపారు చివరికి వారంలో ఐదు రోజుల పనిదినాలు కూడా ఒప్పుకున్నారు గ్రూప్-1 స్థాయి అధికారుల నుంచి అందరికీ నివాస సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు (8/n)
అంతేకాదు వారి పిల్లల చదువు మొదలు కొద్ది కాలం పాటు హైదరాబాద్కి అమరావతికి తిరగటానికి మధ్య ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు ఒక్క ఉద్యోగిని కూడా నొప్పించకుండా అమరావతి తీసుకువచ్చారు ఏ ఉద్యోగ సంఘాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నించలేదు (9/n)
కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఉద్యోగ సంఘ నాయకులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని తన వర్గం వారిని అందులో సభ్యులుగా నియమించుకున్నాడు

దీంతో కిందిస్థాయి ఉద్యోగులు ఆర్తనాదాలు పెడుతున్నా అవి పైకి వినపడే పరిస్థితి లేదు దానికి ఉదాహరణ ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఉద్యమాలు (10/n)
బయటకి కనపడకుండా తొక్కి పడుతున్నారు వారంలో రద్దు చేస్తాం అన్న సిపిఎస్ గురించి గానీ పీఆర్సీ గురించి గానీ డిఏల గురించి గానీ ఉద్యోగ సంఘ నాయకుడు ఒక్కరు కూడా జగన్ రెడ్డిని ప్రశ్నించడంలేదు కింది స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అది పైకి కనపడే పరిస్థితి లేదు (11/n)
You can follow @Iloveindia_007.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.