ఆంధ్రప్రదేశ్ కి జీవనాడైనా పోలవరం ప్రాజెక్టు @ysjagan గారి వైఖరి వల్ల ‘ జీవం ‘ లేని ప్రాజెక్టుగా మిగిలిపోతుందా ? (1/24)
నాడు ప్రతిపక్షంలో , నేడు అధికార పక్షంలో ఉన్న ‘ 6093 ‘ గారు చేసిన , చేస్తున్న పనులే నేడు పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయి . (2/24)
నాడు ప్రతిపక్షంలో , రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా , పోలవరం ప్రాజెక్టు అవశ్యకత గుర్తించకుండా ‘ 6093 ‘ గారు చేసిన ఆరోపణలే నేడు పోలవరం పరుగుకి అడ్డంకి వేసాయనడంలో ఎలాంటి సందేహం లేదు . (3/24)
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ‘తెలుగుదేశం పార్టీ' నాయకులు అవినీతి కోసం అంచనాలు పెంచారంటూ అరోపణలు చేసారు.

నేడు ‘6093‘ గారు,అవే అంచనాలను అమోదించండి అని అంటుంటే కేంద్రం మొండివైఖరి చూపిస్తుంది.

కేంద్రం పోలవరం నిధులకు భారిగా కోత పెట్టిన ప్రశ్నించలేని చేతకానితనం ‘6093‘ గారిది. (4/24)
నాటి ముఖ్యమంత్రి మన ‘ నారా చంద్రబాబు నాయుడు ‘ గారు పోలవరం ప్రాజెక్టు అవశ్యతను గుర్తించి , ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జీవో తీసుకుని వచ్చారు . (5/24)
ఎందుకంటే ఈ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలవకపోతే పోలవరం నిర్మాణం అసాద్యం .

పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లు (150 అడుగులు) నిర్మాణం చేయాలంటే , ఆ ఏడు మండలాలు ముంపులో ఉంటాయి . (6/24)
అప్పటికే పోలవరం నిర్మాణం విషయంలో ఒడిశా , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ కోర్టులలో పిటిషన్స్ దాఖలు చేసాయి .

వీటికితోడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ఏడు మండలాల తరుపున తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తే , పోలవరం నిర్మాణం కలగానే మిగిలిపోతుంది . (7/24)
అందుకే మన ‘ నారా చంద్రబాబు నాయుడు ‘ గారు అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా , ఆ ఏడు మండలాలను ( కుక్కునూరు , వేలేరుపాడు , బూర్గంపాడు , చింతూరు , విఆర్ పురం , కూనవరం , ఎటపాక మండలాలు ) ఆంధ్రప్రదేశ్ లో కలిపి , ఏడు మండలాల నిర్వాసితులకు న్యాయం జరగాలని అనుకున్నారు . (8/24)
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరా పోలానికి లక్ష రూపాయలు , పునరావాస ప్యాకేజి 3 లక్షలు ఇస్తే , తెలుగుదేశం ప్రభుత్వం ఎకరాకు 11 లక్షలు మరియు పునరావాస ప్యాకేజి ఒక కుటుంభానికి 7 లక్షల పై నుండి అందజేసింది . (9/24)
ఇటు నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూనే , కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించకపోయినా మన ‘ నారా చంద్రబాబు నాయుడు ‘ గారు పోలవరం నిర్మాణాన్ని 75% పూర్తిచేసారు . (10/24)
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ‘ 6093 ‘ గారు పోలవరం నిర్మాణంపై అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా , ఆయనకి అధికారం ఇస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇస్తాను , నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి 10 లక్షల రూపాయలు ఇస్తామని హామి ఇచ్చారు . (11/24)
నేడు అధికారంలోకి వచ్చిన ‘ 6093 ‘ గారు నిర్వాసితులకు ఇచ్చిన హామి నెరవేర్చక పోగా , వారందరినీ గోదావరి వరదలతో ముంచేస్తున్నారు .

గడిచిన రెండు సంవత్సరాలుగా ప్యాకేజి రాక , గోదావరి వరదలలో మునగలేక ఏడు మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . (12/24)
అదే సమయంలో @ysjagan గారి వైఖరి వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై నీలినీడలు కమ్ముకుంటుంటే , నిర్వాసితులలో మాత్రం అసహనం పెరిగి తాము తెలంగాణాలో కలిస్తే బాగుండను అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది . (13/24)
గత ‘తెలుగుదేశం ప్రభుత్వం‘ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూసేకరణ చేసి,నిర్వాసితులకు పునరావాస కాలనీలు నిర్మాణం చేసినా,కేవలం ప్యాకేజి ఇచ్చి తరలించడం చేతకాక, @ysjagan గారు నేడు వారిని వరదలలో ముంచడమే కాకుండా వారే పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకించే పరిస్థితి తీసుకుని వచ్చారు. (14/24)
నిజంగా ఈ ఏడు మండలాల ప్రజలు , ఒడిశా , ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే పోలవరం నిర్మాణం అసాధ్యమే .

ఒకవేళ సాధ్యమైనా , 150 అడుగుల నిర్మాణం మాత్రం జరగదు .

పోలవరం ఎత్తు తగ్గించి , పక్క రాష్ట్రాల డిమాండ్లకు తలోగ్గి నిర్మాణం చేపట్టాలి . (15/24)
ఒకవేళ పోలవరం నిర్మాణం ఎత్తు తగ్గించి కడితే రాయలసీమ , ఉత్తరాంధ్ర మాట పక్కనపెడితే కోస్తాంద్రకు కూడా రెండు పంటలకు నీరు అందించలేరు . (16/24)
అలాంటప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి కాదు .

కేవలం ఏదో చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుగానే మిగిలిపోతుంది తప్ప రాయలసీమను రతనాల సీమ చేయలేదు , ఉత్తరాంధ్రను సశ్యసామలం చేయలేదు . (17/24)
అంతేకాకుండా గోదావరి నదిపై ఏ రాష్ట్రానికి లేని వృథానీరు వాడుకునే సౌలభ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నా , నేడు ‘ 6093 ‘ గారి చేతకానితనం వల్ల గోదావరి వరద మొత్తం సముద్రం పాలవడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎకరా భూమి తడిపే పరిస్థితి లేదు . (18/24)
నాడు ‘ పట్టిసీమ ‘ విషయంలో కూడా ‘ వట్టిసీమ ‘ అంటూ విమర్శలు చేస్తూ దానిని అడ్డుకోవడానికి ‘ 6093 ‘ గారు శతవిధాల ప్రయత్నం చేసారు కానీ , మన ‘ నారా చంద్రబాబు నాయుడు ‘ గారు కార్యదక్షతతో నిర్మాణం చేసారు .

నేడు అదే పట్టిసీమ రాష్ట్రానికి దిక్కైంది . (19/24)
కానీ పోలవరం ప్రాజెక్టు బహుళసార్థక ప్రాజెక్టు కాబట్టి అనుమతులు , డిజైన్లు , పటిష్టమైన నిర్మాణం , ముంపు ప్రాంతాల ప్రజలకు న్యాయం , అంతరాష్ట్ర సమస్యలు ఇవన్నీ చూసుకుని నిర్మాణం చేయాలి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 75% పూర్తయింది . (20/24)
ఇంతలోనే ఎన్నికలు రావడం , రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా ‘ 6093 ‘ గారు ఇచ్చిన అబద్దపు హామీలను నమ్మి ‘ ఒక్క అవకాశం ‘ పేరుతో @ysjagan గారికి అధికారం వచ్చంది . (21/24)
ఆ ఇచ్చిన అధికారం వల్ల , నేడు రాష్ట్ర పరిస్థితి అందఃపాతాళానికి పడిపోవడమే కాకుండా , ఒక దార్శనికుడు రాష్ట్ర అభివృద్ధిని , బావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసిన పనులు , ప్రణాళికలు మొత్తం ‘ 6093 ‘ గారి వైఖరి వల్ల నిరుపయోగంగా మారాయి . (22/24)
ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు , మేధావులు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసి కళ్ళు తెరుస్తారో లేక మాకెందుకు మేము బాగున్నాం కదా అని మన ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అందఃకారంలోకి నెడతారో చూడాలి . (23/24)
You can follow @Maganti_Ramji.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.