పుస్తకాలు - మేధావులు అన్న లైన్ తో
ఒక వెబ్ మీడియా కథనం ప్రచురించింది.
పవన్ కళ్యాణ్ "మేధావి అనిపించుకోవడానికి పుస్తకాలు చదవకుండా, ఫోటోషూట్ లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు " అని రాసింది. అలా , చేతల ద్వారా కాకుండా ఫోటో ల ద్వారా ప్రచారం చేసుకుని "మేధావి ఇమేజ్" cont
పొందాలి అనేది ఆయన ఉద్దేశం అని వాళ్ళు సెలవిచ్చారు.

ఇక్కడ "ఇమేజ్" కోసం పాకులాడే పరిస్థితి పవన్ కి లేదు, పైగా ఫోటో షూట్ ల ద్వారా పొందాలి అనుకుంటున్నారు అని ఆరోపించారు. ఒక మనిషి చేసే ప్రతి పని మీద తీసుకునే ప్రతి నిర్ణయం మీద కొంత మంది వ్యక్తుల/పుస్తకాల ప్రభావం ఉంటుంది. Cont
అది పవన్ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనకు సమాజం మీద ఉన్న అవగాహన పుస్తకాల ద్వారా వచ్చింది అని ఆయనే చెప్పారు.అల వచ్చిన జ్ఞానం తోనే పార్టీ సిద్ధాంతాల ,మానిఫెస్టో రూపకల్పన చేశారు, అవి చూస్తే పవన్ పుస్తకాలు చదువుతారా లేదా
అనేది స్పష్టం అవుతుంది. "పచ్చ" కామెర్ల వాడికి అంతా పచ్చ గా కనిపించినట్లు ఆయన మానిఫెస్టో,సిద్ధాంతాలు అవి కనపడవు, కేవలం ఒక ఫోటో తీసుకొచ్చి "ఈయన మేధావి లాగా పేరు తెచ్చుకొడానికి ప్రయత్నిస్తున్నారు "అని అంటారు.పైగా పవన్ చేసిన పోరాట యాత్ర ని ,అందులో బాధితులకు ఇచ్చిన భరోసా ,cont
చూస్తే ఆయన చేతల ద్వారా చేసేది ఎంతో తెల్సుతుంది. పవన్ పుస్తకాలు "మేధావులకు మాత్రమే" అనే రచయిత తెలిపారు, అందులో మేధావులకు మాత్రమే అని ఎవరు ఎక్కడ చెప్పలేదు, పుస్తకాలు మేధావులకు మాత్రమే అని ఉంటాయి అనుకోడం బట్టి మీరు ఎలా ఆలోచిస్తారు అనేది అర్థమవుతుంది.
మరొక విషయం ఏంటంటే "ఇంత వరకు చదివింది ఎంటి ఇప్పుడు చేస్తుంది ఎంటి " అని ,Che గురించి చదివి "మత రాజకీయం", చెయ్యడం ఎంటి అనేది వారి ప్రశ్న.
ఇక్కడ చే గురించి చదవడానికి, ఒక మతం మీద జరుగుతున్న దాడి నీ ఖండించడానికి చేస్తున్న దీక్ష కి సంబంధం ఎంటి వాళ్ళే చెప్పాలి.
వారు దృష్టిలో "కమ్యూనిస్టు భావజాలం ఉంది కాబట్టి ,మతం మీద జరుగుతున్న దాడిని ఖండించకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం. ఒక సిద్ధాంతం లో మనకి సరిపడే మనకి నచ్చిన భావాలని తీసుకుని అవి నిత్య జీవితం లో కాని ప్రజా జీవితం లో కాని అవలంభిస్తారు. అలాంటిదే కమ్యూనిస్టు భావజాలం లోని "పోరాట స్ఫూర్తి" ,
దానినే పవన్ అలవర్చుకున్నారు. జనసేన సిద్ధాంతాలు చూస్తే అవి ,అన్ని సిద్ధాంతాల నుండి ఏవైతే పవన్ సరైనవి అనుకున్నారో వాటిని అర్థంచేసుకుని సిద్ధాంతాల రూపం లో పెట్టారు. ఇక్కడ ఆయన్ని ఒక సిద్ధాంతానికి అంత గట్ట దానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక రెండవది, "మత రాజకీయం" అని.
భారతీయ లౌకికవాదం లో మతాలకు దూరం గా ఉంటూనే ,మతాల మధ్య, కులాల మధ్య అసమానతలు ఉండకూడదు అనేది కూడా ఉంది. ఇక్కడ హిందూ మతం మీద గత నెలలు గ జరుగుతున్న దాడులు జరుగుతున్నాయి, దాని మీద చర్యలు తీసుకోవాలి అనడం " మత రాజకీయం" ఎలా అవుతుంది!?
మత రాజకీయం అంటే "minority Lu ఉన్న చోట minority నాయకులని తీసుకొచ్చి ప్రచారం చేయించడం" అంటే కర్నూల్ లో అబ్దుల్లా తో చేయించినట్లు. మతాలని అడ్డుపెట్కుని ఓట్లు వేయించుకోవడం. ఇక్కడ ఒక వర్గం మీద దాడిని ఖండిస్తే మత రాజకీయం ఎంటి వాళ్ళే బదులు ఇవ్వాలి. సర్వమత సమానత్వం పాటించే సమాజం లో
ఒక మతం యొక్క మనోభావాలు దెబ్బతినేలా కొన్ని శక్తులు పని చేస్తుంటే వాటి మీద పవన్ చర్యలు కోరారు, దానికి "మత రాజకీయం" అనడం వాళ్ళకే చెల్లింది. పైగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరే మతాన్ని కాని వర్గాన్ని కాని కించపరిచే విధం గా చిన్నచూపు కాని లేవు. జరిగిన అన్యాయాన్ని లేవనేతదమ్ వీళ్ళకి మత
పరమైన విభజన లాగా కనపడి ఉండచ్చు, ఇక్కడ మత పరం గా విడదీసే విధం గా ఆయన చేసింది ఎంటి ? వేరే మతస్తులకి హిందువులకి గొడవ పెట్టరా? ఆహ్ "విభజన " ఎంటొ వారే చెప్పాలి.

"
భావజాలం లో కల్తీ " అని చెప్పుకొచ్చారు - అసలు జనసెన సిద్ధాంతాలు చదివితే భావజాలం ఎంటి అనేది అర్థం అవుతుంది. మిడి మిడి జ్ఞానంతో తో " భావజాలం లో కల్తీ " అని చెప్పడం కూడా వాలకే చెల్లింది. పార్టీ సిద్ధాంతం ఏ ఒక్క వైపు లేదు, అన్ని సమపాళ్ళలో ఉన్నాయి , అది చదివితే అర్థం అవుతుంది.
చే జీవితం నుండి నేర్చుకున్నది ఆచరణ లో పెట్టారు, అది చేయబట్టే ఉద్దానం,ఆక్వా పార్క్, వంతాడ లాంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. చే జీవితం లో పోరాట స్ఫూర్తి నీ తీసుకుని అనేక అంశాలు లేవనెత్తిన పవన్ నీ , ఒక మతం మీద జరిగిన దాడిని ఖందిస్తే దానికి, "
పవన్ పుస్తకాలు చదవలేదు ,కేవలం మానారిజం బట్టి చే కి ఆకర్షితుడయ్యాడు " అనే అభిప్రాయానికి వచ్చారు, కాని పవన్ చే జీవితం నుండి నేర్చుకున్న అంశాలని ఆయన "చేతల" ద్వారా చెప్పారు అది "uddanam దీక్ష కావచ్చు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా మీద చేసిన పోరాటం నిదర్శనం,
బహుశా అది వాళ్ళ అసమధీయుల హయాంలో జరిగాయి కాబట్టి కనపడి ఉండకపోవచ్చు.
పుస్తకాలు ఫోటోషూట్ లలో పెట్టిన పుస్తకాల గురించి కూడా ఈ మేధావి ,పవన్ పుస్తకాలని ఎలా అర్థం చేసుకున్నారు కూడా ఈయన చెప్తున్నారు. "అక్కడున్న పుస్తకాలు సంస్కృతి గురించి… సంప్రదాయాల గురించి..
సనాతన ధర్మాల గురించి… సమాజంతో వ్యవహరించాల్సిన పద్దతులపై ఓ అవగాహనకు వస్తారు" అని చెప్పిన ఈయనే , వీటిని "మత రాజకీయం కోసం, విడతీయడదానికి " వాడుతున్నారు అని ఒక conclusion కి వచ్చారు.
మనిషిని ,మనిషి ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా తనకి తెలిసిన మిడి మిడి జ్ణానం తో తాను అనుకున్నదే సత్యం
అనుకోడం మూర్ఖత్వం.
ఒక మత గ్రంధాన్ని చేతిలో పెట్టుకుని తిరిగి , ఒక మత పరిశుద్ధ నిలయాలకి వెళ్లి ఓట్లు అడుక్కునే, పైగా వేరే మతం జనలని బుజ్జగించే పనులు చేసే, కుటుంబ సభ్యుల తో సహా పబ్లిక్ గా "ప్రవచించే" ఒక పార్టీ గురించి నేను మాట్లాడ దలచుకోలేదు
You can follow @HariVishalMudra.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.