🌾🌾👳♂🌾🌾
*ఒక ఎకరానికి రైతు పెట్టిన పెట్టుబడి ఖర్చులు సుమారుగా, 2020 ఏడాదికి*:

1. నారుమడి, మరియు
పొలం దున్నడం : ₹ 5500=00
2. చదును చేయడం వేయడం. : ₹ 1500=00
3. గట్టు చెక్కడం పెట్టడం : ₹ 1000 =00
4. వరి నాటు. : ₹ 4000=00
5. వరి విత్తనాలు హైబ్రిడ్20 కిలోలు : ₹ 1800=00
6. కలుపు మందు కలుపు తీయడం : ₹ 1800=00
7.DAP 2 బస్తాలు : ₹ 2500=00
8. జింక్ 10 కిలోలు : ₹ 600=00
9.గుళికలు. : ₹ 1000=00
10.యూరియా2బస్తాలు. : ₹ 700=00
11. పొటాష్1బస్తా : ₹ 950=00
12.మందుల పిచికారీ : ₹ 1000=00
13. వరి కోత మిషన్ : ₹ 2000=00
14. మిషన్ కు ట్రాక్టర్ : ₹ 1000=00
15. ధాన్యం ఆరబెట్టడం. : ₹ 500=00
16. హమాలి ఛార్జ్ : ₹ 1000=00
*రైతు పెట్టుబడి మొత్తము. : ₹ 26,850=00*
ధాన్యం దిగుబడి బస్తాలు = *70*
1 బస్తాకి కిలోలు = *40*
70×40 = *28 క్వింటాళ్లు*

క్వింటాలుకు...ధర *₹ 1810×28= 50,680=00*

*రైతు పెట్టుబడి= ₹ 26,850=00*
*రైతుకు మిగిలింది= ₹ 23830=00* *రైతు 6నెలల కష్టార్జితం*

రైతుకు 1నెల కష్టార్జితం = ₹ 3971=00
అంటే రైతుకు ఒక్క రోజుకు పడే కూలి ₹ *132=00*

*ఆరుకాలం కష్టపడితే వచ్చే ఆదాయం ..??*
ఒకవేళ ప్రకృతి కన్నెర్ర చేసై??
గాలి దుమారం, వడగండ్ల వాన లేదా అగ్గితెగులు, మెడవిరుపు, వగైరా లాంట
రోగాలు వస్తే ఏంటి రైతు పతిస్థితి???

*రైతు ఆదాయం కనీసం ఇంకొక 50% నుంచి 75% పెరగడమే ఎకైక పరిష్కారం, దానికి ప్రభుత్వం మార్గాలు అనుసరించాలి, రైతు ఉత్పత్తులను విలువ జోడిస్తే చాలా వరకు మేలు చేకూరుతుంది*

క్రికెటర్లకు, సినిమా నటులకు, రాజకీయ నాయకుల పోస్టులకు మనం వందలు, వేలు, లక్షల్లో
లైక్కు, షేర్లు, కామెంట్లు పెడతాము, ఎందుకంటే మనం వాళ్ళను అభిమానిస్తారు గాబట్టి, తప్పు లేదు కానీ కష్టాలు పడి, మనకు అన్నం పెట్టే రైతుపై అంతకన్నా అభిమానం చూపాలి, రైతు కష్టాన్ని గుర్తించాలి, అంతే కాక 6 నెలలు కష్టపడితే కానీ రైతు పండించే ధాన్యం గింజ మన కంచంలో అన్నం గా మనం తింటాము,
కావున *ఒక్క అన్నం మెతుకు కూడా వృధా చెయ్యొద్దు అని నా మనవి.*

ఈ పోస్టును దయచేసి విరివిగా షేర్ చేసి మన రైతుపై మన అభిమానం చూపిద్దాం.🙏🙏

మీ రైతు .....
🌻🌻🌹🌹🌾🌾
🌾🌾🌾🌾
@maneesha_pspk @mahidhfpspk @pspk_girl @donbradma
You can follow @sivass053.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.