1893,11 సెప్టెంబర్...స్వామి వివేకానంద వారు చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో- మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మతసామరస్యాన్ని కాపాడుకుందాం’ అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నాం.
అంతా దైవ సంకల్పం...🙏
•స్వామి వివేకానంద వారు ప్రపంచ మత సమ్మేళనంలో ఇలా చెప్పారు...

సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తాను. సర్వమత సహనాన్ని మాత్రమేకాదు సత్వమతాల సత్యాలనీ మేం విశ్వసిస్తాం.
•సమస్త మత దేశాల నుంచీ పరపీడితులై... శరణాగతులై వచ్చినవారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను.
•అనేక లక్షల ప్రజలు ఇప్పటికీ చెప్పే మాటలను చెప్పాలనుకుంటున్నాను: ''నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాలలో పుట్టి, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరకు సముద్రంలో కలుస్తాయో... అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు. చూడడానికి ఈ దారులన్నీ వేరైనా, అవన్నీ కూడా దేవుణ్నే చేరుకుంటాయి.''
•ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం. భగవద్గీతలో ఇలా చెప్పారు ''నా దగ్గరకు వచ్చిన దేన్నైనా, అది ఎలాంటిదైనా, నేను దానిని స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను ఎంచుకుంటారు, కష్టాలను ఎదుర్కొంటారు. కానీ, చివరకు నన్ను చేరుకుంటారు''
•మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి.
•ఆ భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది.
- Swami Vivekananda
You can follow @PawanKalyan.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.