హిందువుగా నా సంస్కృతి నాకు పరిచయం అయ్యింది నా తల్లి భాషలో. కొన్ని వేల సంవత్సరాల ప్రాచీనతతో, ఘనమైన సాహితీ చరిత్రతో, అద్భుతమైన విద్వత్‌సంపదతో, దేదీప్యమానంగా వెలుగొందుతున్న నా భాషను తొక్కి, నా మీద హిందీ పులమాలనుకునే నువ్వు నాకు నీతులు బోధించే హిందువువా?1
నా సంప్రదాయాలు నాకు పరిచయం అయ్యింది నా పండుగలతో. నా పండుగలను నన్ను జరుపుకోనీకుండా రంగులు లేని హోళీ పండుగలు చేసుకోమని, టపాసులు లేని దీపావళి జరుపుకోమని ఎవడో వేసిన కేసులకు కోర్టులు వత్తాసు పలుకుతుంటే, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నవాడిని, నాకు నీతులు చెప్పే హిందువువా?2
క్రిస్‌మస్‌కు కేకులు పంచిన నా స్నేహితుడే, సంక్రాంతికి నేనిచ్చిన పాయసం తిన్నాడు. రంజాన్‌కు సేమ్యా పంచిన నా స్నేహితుడే, దీపావళి నాతో కలిసి జరుపుకున్నాడు. చేతిలో డబ్బులు చాలకపోతే, గురుద్వారాలో లంగర్ తిన్న రోజులు నాకింకా గుర్తే.3
అరవైయేళ్ళుగా నా మిత్రులైనవాళ్ళని ఆరేళ్ళల్లో శత్రువులు చేయాలనే నీ దుష్ప్రయత్నంలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు కనిపించటంలేదు, పది నోళ్ళతో పగ, ప్రతీకారం, వంచన, మోసం, ద్రోహం, కుత్సితం, కుతంత్రం చేస్తున్న రావణుడే కనిపిస్తున్నాడు.4
వేలాది గుళ్ళు ధ్వంసమైతే చేయగలిగారు కానీ, ఆర్ష ధర్మాన్ని నశనం చేయలేకపోయారని నీకు తెలియదా? ఎన్ని మసీదులు నువ్వు ధ్వంసం చేస్తే మొగలాయిల చరిత్ర మనదేశంలో మటుమాయం కాగలదని నీ ఊహ? అది సాధ్యమేనా? దేశాభ్యున్నతికి అది మార్గమా?5
మరో విషయం. హిందు సంస్కృతి సంప్రదాయాలంటే, గుళ్ళు గోపురాలే కాదురా సన్నాసి. గుళ్ళ కోసం పోరాడేవారే హిందువులు అనే అర్ధం చెప్పకురా వెర్రివెధవా! మోడీ నుంచి యోగి దాకా ఏదో వంకతో గుళ్ళు కూల్చినవాళ్ళలో భాజపాలు కూడా ఉన్నారు.6
అది సాధ్యమూ, అదే మార్గమూ అయితే ఆ కార్యక్రమాన్ని అధికారికంగా మొదలేయొచ్చుగా! క్రైస్తవ మతాంతీకరణ వల్ల హిందువులకు అన్యాయం జరుగుతున్నట్లైతే, మతాంతీకరణలు నిషేధిస్తూ చట్టం ఎందుకు తీసుకురారు? ఇవేమీ చేయరు. హిందువులకు అన్యాయం జరిగిందనే ప్రచారంతో ఓట్ల పబ్బం గడుపుకునే కుటిల ప్రయత్నాలివి.7
నిజంగా హిందువుల కోసం పుట్టిన, హిందువుల కోసం పోరాడే పార్టీ అయితే, పార్టీ పేరు భారతీయ హిందు పార్టీ అని మార్చుకో. నీ పార్టీలోని ఇతర మతస్థులను తీసిపారేయ్. నీ పార్టీ వరకు అవసరమైన వాళ్ళు, నాకు మిత్రులు కాకూడదా?8
నా దేశం భగవద్గీత
నా దేశం అగ్నిపునీత సీత
నా దేశం కరుణాంతరంగ
నా దేశం సంస్కార గంగ (డా.సినారె)9
నేను హిందువునని సగర్వంగా చాటుకుంటాను. కానీ, భాజపాలు బోధించే కుహానా హిందువుని మాత్రం కాదు.9
నా దేశం అగ్నిపునీత సీత
నా దేశం కరుణాంతరంగ
నా దేశం సంస్కార గంగ (డా.సినారె)9
నేను హిందువునని సగర్వంగా చాటుకుంటాను. కానీ, భాజపాలు బోధించే కుహానా హిందువుని మాత్రం కాదు.9