అభివృద్ధి వికేంద్రీకరణకు అర్థం చెప్పిన తెలుగుదేశం పాలన

శ్రీకాకుళం.. ప్ర‌గ‌తికి శ్రీకారం
శ్రీకాకుళం జిల్లాతోనే ప్ర‌గ‌తికి శ్రీకారం చుట్టారు నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.
విజ‌య‌న‌గ‌రం .. విజ‌య‌గ‌ర్వం

వెన‌క‌బ‌డిన ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో చిన్న జిల్లా అయిన‌ విజయనగరం..టిడిపి ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిలో దూసుకుపోతూ విజ‌య‌గ‌ర్వంగా అగ్ర‌స్థానంలో నిలిచింది.
విశ్వవిఖ్యాత విశాఖ‌

ఉత్త‌రాంధ్ర గుండెలాంటి విశాఖ తెలుగుదేశం పాల‌న‌లో విశ్వవిఖ్యాతి గాంచింది
తూర్పుగోదావరి..ప్ర‌గ‌తి దారి

చంద్ర‌బాబు త‌న ఐదేళ్ల పాల‌న‌లో తూర్పుగోదావరి జిల్లాని ప్ర‌గ‌తి దారుల్లో పరుగులు పెట్టించారు.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో చేసి చూపించారు.ఏలేరుకు గోదావరి జలాలను తీసుకెళ్లారు.
పశ్చిమగోదావరి ప్రగతికి రాదారి...

2014 లో అధికార పీఠం దక్కడానికి కారణమైన పశ్చిమగోదావరి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా పనిచేసారు చంద్రబాబు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి పరిచయం చేసారు.
కృష్ణా డెవ‌ల‌ప్‌మెంట్ ఎక్స్‌ప్రెస్‌

కృష్ణా జిల్లా డెవ‌ల‌ప్‌మెంట్‌ని చంద్ర‌బాబు త‌న పాల‌న‌లో ఎక్స్‌ప్రెస్ రీతిలో ప‌రుగులు పెట్టించారు. రెండంకెల వృద్ధిరేటు, స్థూల వస్తు ఉత్పత్తి విలువ, తలసరి ఆదాయం.. వంటి వాటితో పాటు శాఖలవారీ ప్రగతి సూచికల్లో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది
గుంటూరు జిల్లా ..అభివృద్ధి ఖిల్లా

ప్ర‌జ‌ల కోసం ఏర్ప‌డిన ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిలో చాలా భాగంగా గుంటూరు జిల్లాలోనే వుంది. 29 వేల మందికి పైగా రైతుల త్యాగాల‌తో స‌మ‌కూరిన 34 వేల ఎక‌రాల‌తో దేశ‌మే గ‌ర్వ‌ప‌డేలా రాజ‌ధాని నిర్మాణాలు ఊపందుకున్నాయి.
ప్రకాశం.. ప్ర‌గ‌తి వికాసం

తెలుగుదేశం ప్ర‌భుత్వం ప్ర‌కాశం జిల్లా.. ప్ర‌గ‌తి వికాసానికి దోహ‌ద‌ప‌డింది. త‌ర‌చూ అతివృష్టి, అనావృష్టిల బారిన‌ప‌డే ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వానిదే.
నెల్లూరు స‌ర్వ‌తోముఖాభివృద్ధి

ప్ర‌జ‌ల సంక్షేమం కోసం..తెలుగువారి ప్ర‌గ‌తి కోసం ఏర్ప‌డిన తెలుగుదేశం పార్టీ పాల‌న‌లో అభివృద్ధి ఫ‌లాలు అన్ని రాష్ట్రాల‌నూ స‌మానంగా అందించి అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు అస‌లైన అర్థం చెప్పింది. నెల్లూరు జిల్లా స‌ర్వ‌తోముఖాభివృద్ధికి కృషి చేసింది.
క‌డ‌ప జిల్లాలో ప్ర‌తీ గ‌డ‌ప‌కూ ప్ర‌గ‌తిఫ‌లాలు

తెలుగుదేశం అధికారంలో వున్న ఐదేళ్ల‌లో క‌డ‌ప జిల్లాలో ప్ర‌తీ గ‌డ‌ప‌కూ అభివృద్ధి ఫ‌లాలు చేరాయి. క‌డ‌ప జిల్లాలో 10 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఒక్క సీటే గెలిచినా తెలుగుదేశం పార్టీ ప్ర‌గ‌తి ఫ‌లాలు అందించే విష‌యంలో ఎటువంటి ప‌క్ష‌పాతం చూప‌లేదు.
క‌ర్నూలు..క‌ళ్లుచెదిరే ప్ర‌గ‌తి

తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో ప్ర‌ణాళిక ప్ర‌కారం రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి పాటుప‌డ్డారు.
అభివృద్ధి వికేంద్రీకరణతో క‌ర్నూలు జిల్లా క‌ళ్లు చెదిరే ప్ర‌గ‌తిప‌థంలో దూసుకుపోయింది.
అనంత‌పురం అభివృద్ధిలో అగ్ర‌గామి

అనంత‌మైన క‌ర‌వుతో అల్లాడుతున్న అనంత‌పురం జిల్లా టిడిపి ఐదేళ్ల పాల‌న‌తో అభివృద్ధిలో అగ్ర‌గామిగా నిలిచింది. ఇత‌ర రాష్ట్రాలతో పోటీప‌డి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ‘కియా’ కార్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ని ర‌ప్పించి 11 వేల మందికి ఉపాధి క‌ల్పించారు.
చిత్తూరు ప్ర‌గ‌తికి చిరునామా

న‌వ్యాంధ్ర‌కు ముఖ్య‌మంత్రి అయ్యారు చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో పుట్టిన నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు. కుప్పం నుంచి వ‌రుస‌గా ఎన్నికై న‌వ్యాంధ్రతోపాటు త‌న సొంత జిల్లానీ అన్ని జిల్లాల‌తో స‌మానంగా అభివృద్ధి చేసిన ఘ‌న‌త ఆయ‌న సొంతం.
You can follow @ChakriMovva.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.