కోవిడ్-19-ప్లాస్మా చికిత్స-దాని ఉపయోగం-మన సామాజిక బాధ్యత.
ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి?
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తుల రక్తంలో ఆ వైరస్ మీద ఎలా పోరాడాలో తెలిసిన యాంటీ బాడీస్ ఉంటాయి. ఈ రక్తాన్ని కొత్తగా కరోనా వైరస్ బారిన పడి, దానితో పోరాడుతున్న రోగులకు ఇచ్చినపుడు 1/7

అప్పటికే ఆ వైరస్ తో ఎలా పోరాడాలో తెలిసిన యాంటీ బాడీస్ వైరస్ మీద పోరాడి ఆ రోగిని క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడేస్తుంది.
ఈ ప్లాస్మా చికిత్స ఎంతవరకు పని చేస్తుంది?
ఈ ప్లాస్మా చికిత్సని గతంలో SARS, H1N1, Ebola వంటి వ్యాధుల చికిత్సలో విజయవంతంగా వాడటం జరిగింది. 2/7

ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షణాలు ఉన్న రోగుల మీద జరుగుతున్న,జరిగిన పరిశోధనల్లో ఈ ప్లాస్మా చికిత్స సమర్ధవంతమైన,సురక్షిత చికిత్స అన్న ఫలితాలు వస్తున్నాయి.ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేన్ద్ర జైన్ గారు స్వయంగా ఈ ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్నారు. 3/7
ప్లాస్మా చికిత్స ఎవరికి అవసరం పడుతుంది?
భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడినా ఆరోగ్యం మెరుగు పడని వారికి ఈ ప్లాస్మా థెరపీని ఇవ్వవచ్చు. 4/7

ప్లాస్మా దానం చేయడానికి ఎవరు అర్హులు ?
అప్పుడే కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులు ఈ ప్లాస్మా దానానికి అర్హులు. అయితే దాత యొక్క బ్లడ్ గ్రూప్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ సరిపోవాలి. దానం చేసే వారికి ఇతర వ్యాధులు ఉండకూడదు. రక్తంలో హీమోగ్లోబిన్ కూడా సరిపడా ఉండాలి. 5/7

ఎంత రక్తం ఇవ్వవలసి ఉంటుంది?
సాధారణంగా రోగికి 200ml ప్లాస్మాని ఒకటే మోతాదు ని 2 గంటల పాటు ఎక్కిస్తారు. దానం చేయాలి అనుకునే వాళ్ళ దగ్గరినుంచి 350-400 ml రక్తం తీసుకోవడం జరుగుతుంది. ఇలా రక్తం దానం చేయడం వలన మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ రావు. 6/7

మన సామాజిక బాధ్యత ఏమిటి?
ఇప్పటికే చాలాచోట్ల ప్రభుత్వాలు,స్వచ్చంద సేవా సంస్థలు కోవిడ్ నుంచి కోలుకున్న వారినుంచి రక్తం సేకరించి "ప్లాస్మా బ్యాంక్"లు ఏర్పాటు చేశారు. అలాంటి వారికి మనం స్వచ్చందంగా ప్లాస్మా ఇవ్వడమే మన సామాజిక బాధ్యత.
"అందరికోసం ఆలోచిద్దాం.బ్రతుకుదాం,బ్రతికిద్దాం"7/7

ఈ ట్వీట్ వేసేలా ప్రోత్సహించిన @sairazesh గారికి, అవసరమైన సమాచారం అందించిన @Mahatma_Kodiyar గారికి ధన్యవాదాలు
.