చైనా - మూడో ప్రపంచ యుద్ధం, ఒక ఆలోచన.
జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం ఓడిన తర్వాత ముందు తన ఆర్థిక పుష్ఠి పైన దృష్టి పెట్టింది. ఆ తర్వాత పక్కనున్న బలహీన దేశాలైన పోలాండ్, ఆస్ట్రియా మొదలైన దేశాల్ని ఆక్రమించింది. చైనా కూడా అలాగే . ముందుగా చైనా నలభై ఏళ్ల క్రితం ఒక పేద, అభివృద్ధి చెందుతున్న
జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం ఓడిన తర్వాత ముందు తన ఆర్థిక పుష్ఠి పైన దృష్టి పెట్టింది. ఆ తర్వాత పక్కనున్న బలహీన దేశాలైన పోలాండ్, ఆస్ట్రియా మొదలైన దేశాల్ని ఆక్రమించింది. చైనా కూడా అలాగే . ముందుగా చైనా నలభై ఏళ్ల క్రితం ఒక పేద, అభివృద్ధి చెందుతున్న
దేశం. ఆ తర్వాత కమ్యూనిస్టు నినాదం కొంచెం పక్కన పెట్టి పరిశ్రమలు స్థాపించి స్థూల జాతీయ ఉత్పత్తి లో ఈరోజు అమెరికా ని చేరింది. ఆ తర్వాత నార్త్ కొరియా ని ఒక పెంపుడు కుక్కలా పక్కన పెట్టుకుంది. సైనిక బలం లేని టిబెట్ ని ఆక్రమించింది. ఆర్థిక బలం లేని పాకిస్తాన్ ని కోరకోరం హైవే పేరుతో
లోబరుచు కుంటోంది. ఇప్పటికి రవణాకి వాడినా తర్వాత కరాచీలో కచ్చితంగా నావికా స్థావరం ఏర్పాటు చేస్తుంది, లేదా ఇప్పటికే చేసి ఉంటుంది. పక్కనే ఉన్న నేపాల్ ని భయపెట్టి, వాళ్ళ పాఠ్యాంశాల్లో మాండరిన్ తప్పనిసరి చేసింది. ఇది ప్రపంచంలో ఏకైక పూర్తి హిందూ దేశం అయిన నేపాల్ సంస్కృతిని దెబ్బతీసే
మొదటి అడుగు. ఇక పక్కనే ఉన్న వియత్నాం, తైవాన్ లాంటి దేశాల పరిస్థితి చెప్పక్కర్లేదు. వాటిని రేపు చైనా అంతర్భాగం అన్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇక మన దేశం పైన దాడి, దక్షిణ ఆసియా లో బలమైన సైనిక శక్తి అయిన భారత్ కి విసిరిన సవాలు ప్రపంచం తేలికగా తీసుకోదు. ప్రపంచానికి ఒక పొలికేక ఇది.
ఇక పోతే అభివృద్ధి చెందిన దేశాలైన యురోపియన్ దేశాలు, సాంస్కృతికంగా బలహీనమై, చేవలేక ఇప్పుడు యుద్ధం చెయ్యలేని పరిస్థితి. ఎవరి బ్రతుకు వాళ్ళు వెళ్లదీస్తున్నారు. ఆస్ట్రేలియా , అమెరికా లాంటి దేశాల్లో చైనీయులు చాలా మంది స్థిరపడి వారి ఆర్థిక స్థితిని శాసిస్తున్నారు. అలాగే విద్యాసంస్థలు
ఉదాహరణకి సిడ్నీ విశ్వవిద్యాలయం లో సగానికి సగం విద్యార్థులు, అధ్యాపకులు చైనీయులు. అలాగే ఆస్ట్రేలియా పాఠశాల ల్లో మాండరిన్ నేర్పుతారు. ఇవన్నీ సాంస్కృతిక వలస వాదానికి ప్రతీకలు. ఇప్పుడు ఆస్ట్రేలియా పూర్తిగా చైనపై ఆధారపడిన తర్వాత ఆస్ట్రేలియా సార్వ భౌమత్వాన్ని ప్రపంచానికి చాటడానికి
ప్రయత్నం చేసినపుడు, చైనా ఆర్థిక ఆంక్షలు విధించింది. విలేఖరి అయిన ఒక ఆస్ట్రేలియా పౌరుడికి బీజింగ్ మరణ శిక్ష విధించింది. మొన్నటి నుండి ఆస్ట్రేలియా పై సైబర్ దాడులు జరుగుతున్నాయి.కరోనా తో అమెరికా బలహీనతలు బయటపడ్డాయి. వర్ణ వివక్ష విప్లవాన్ని చైనా దగ్గరుండి ఎగదోస్తు న్నట్లు అనుమానాలు
ఉన్నాయి, ఇప్పుడు అమెరికా డాలర్ కి గిరాకీ తగ్గింది. ఇప్పుడు చైనా దగ్గర ప్రపంచంలో ప్రతివ్యక్తి సమాచారం సేకరించే సాంకేతికత ఉంది. చైనాలో గూగుల్, ఫేస్బుక్ నిషేధం ద్వారా సమాచారానికి అడ్డుకట్ట వేసింది. వాళ్ళ గురించి బయటి ప్రపంచానికి వాళ్ళు చెప్తే గానీ తెలీదు. ఎన్నికలు నిషేధించారు.
షి జింపింగ్ ని జీవిత అధ్యక్షుడి ని చేశారు. బౌద్ధులు అందర్నీ బంధించి వాళ్ళ అవయువాలతో వ్యాపారం చేశారు. అన్ని మసీదులు పడగొట్టారు. ముస్లింలు అందర్నీ నిర్బంధించారు. ఇప్పుడు చర్చిలకు ఉన్న సిలువల్ని తీసేసారు. ఇప్పుడు చైనా లో జనాభా అంతా 99 % ఒకే జాతికి చెందినవారు. అంటే అల్పవర్గాల వాళ్ళు
లేరు. ఇక తర్వాత దేశాలను ఆక్రమించటమే మిగిలింది. అణుయుద్ధం వస్తే ముందు ఉత్తర కొరియాని పావుగా వాడుతుంది. ఈసారి జరిగే యుద్ధం త్వరగా ముగిసిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం లా అంతకాలం సాగదు. ఇక తర్వాత బానిస దేశాలు స్వాతంత్రోద్యమ ఆలోచన వదిలేసి బానిస ల్లా బ్రతకాల్సిందే. పైన చెప్పటం మరిచాను,
హాంకాంగ్ ని కూడా ఆక్రమించలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. నానాజాతి సమితి లా ఐక్య రాజ్య సమితి కూడా ఏమీ చెయ్యలేని పరిస్తితి వస్తుంది. ఇక ఆ తర్వాత రవి అస్తమించని చైనా సామ్రాజ్యం వస్తుంది అని చైనా భావిస్తుంది, కానీ ఈలోపు భూమి ఏదో ఒకటి చేసి ఈ మానవ జాతినే అంతమొందిస్తే బాగుణ్ణు.
నమస్కారం.
నమస్కారం.