ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ !!

2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ విలువ - ₹2,24,789 కోట్లు!

(2019-20 సంవత్సరానికి ₹2,27,974 కోట్లుగా ఉంది. గత బడ్జెట్ కేటాయింపుల్లో 70% కూడా ఖర్చు పెట్టలేదు.)
రెవెన్యూ ఖర్చు ₹1,80,392 కోట్లు కాగా, మౌలిక సదుపాయాల(revenue expenditure) కొరకు ₹44,396 కోట్లు కేటాయించారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ₹1,14,684 కోట్లు కాగా ..2019-20 ఆర్థిక సంవత్సరంలో ₹1,10,871 కోట్లకు పడిపోయింది.(ఆదాయంలో ₹3,813 కోట్లు తగ్గుదల!)
2019-20 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయం ₹2.14 లక్షల కోట్లు కాగా ..₹1.55 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది!
(2018-2019 లో ఇది ₹1.8లక్షల కోట్లు - ₹1.5 లక్షల కోట్లుగా ఉంది.)
రాష్ట్ర రుణభారం ₹2.59 లక్షల కోట్లు నుండి ఈ మార్చి చివరికి ₹3.02 లక్షల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-21) ₹3.48 లక్షల కోట్లకు చేరవచ్చని బడ్జెట్ అంచనా!

రెవెన్యూ లోటు ₹18,434 కోట్లు, ద్రవ్య లోటు ₹48,295.58 కోట్లుగా ఉండవచ్చని అంచనా!
రాష్ట్ర స్థూల ఉత్పత్తి( #GSDP)లో ద్రవ్య లోటు 4.78% ఉండగా, రెవెన్యూ లోటు 1.82% గా ఉంది.

గత ఆర్థిక సంవత్సరంలో (2019-20) సేవల రంగంలో 9.1% వృద్ధి రేటు, వ్యవసాయం-అనుబంధ రంగాల్లో 8% వృద్ధి రేటు మరియు పారిశ్రామిక రంగంలో 5% వృద్ధి రేటు సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
(2018-19 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగంలో 11.09%; వ్యవసాయ రంగంలో 10.08%; పారిశ్రామిక రంగంలో 10.24% వృద్ధి రేటు నమోదైంది.)అంటే .. ప్రధాన రంగాల్లో అనుకున్నంతగా వృద్ధి సాధించలేదు.)
మరో ప్రధాన ఆదాయ వనరైన నీటి పారుదల రంగానికి గత బడ్జెట్ కంటే తక్కువ కేటాయింపులు చేసారు. 2019-20 బడ్జెట్ లో 13వేల కోట్లు కేటాయించగా ..కేవలం 5వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రస్తుత (2020-21) బడ్జెట్ లో 11వేల కోట్లు మాత్రమే కేటాయించారు.
ఇవికాక ..2019-20 ఆర్థిక సంవత్సరంలో 40వేల గృహాలు నిర్మించినట్లు ప్రభుత్వ ప్రకటన!(గత ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 మధ్య కాలంలో ఎనిమిది లక్షల గృహాలు నిర్మించినట్లు ప్రస్తుత ప్రభుత్వమే శాసనసభలో ప్రకటించింది. అంటే .. సరాసరిన సంవత్సరానికి 1,60,000 ఇళ్ల నిర్మాణం జరిగింది.
You can follow @APfactzone.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.